తిరుపతిలో పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తిరుపతిలో టీడీపీ పార్టీకి తీవ్ర నిరాశ మిగిలింది. అతి తక్కువ స్థానాల్లో విజయాన్ని అందుకుంది. అధికార పార్టీ మాత్రం భారీ స్థాయిలో విజయాన్ని అందుకొని జెండాను పాతారు. ఇప్పుడు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో స్వయంగా అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే లు రంగం లోకి దిగి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ గుర్తులను ఉపయోగించి జరిగే ఈ ఎన్నికల్లో పోటీకి దిగేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇలా చూసుకుంటే ఈ ఎన్నికల్లో విజయాన్ని అందుకోవడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తున్నారు. మార్చి 2 నుంచి రాజకీయ చర్చలు షురూ కానున్నాయి.