కడప జిల్లాలో పుర పాలక ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్లు వేయడానికి ముందే ప్రచారాన్ని ప్రారంభించారు వైసీపీ నేతలు. జిల్లాలో పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి నామపత్రాల ఉపసంహరణ తేదీ సమీపిస్తుండడంతో రాజకీయ నాయకులు వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా అధికార పార్టీ నేతలు ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడానికి కసరత్తు ప్రారంభించారు. ఆయా పురపాలక సంఘాల్లో ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి వ్యతిరేక వర్గం అభ్యర్థులు నామపత్రాలు ఉపసంహరించుకునేవిధంగా చర్చలు జరుపుతున్నారు. వివిధ సామాజిక వర్గాలకు పట్టు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.