జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో తనదైన స్టైల్లో రాణిస్తున్నారు. కాగా, ఆంధ్ర లో మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికలు జనసేనకు ఊరటను కలిగించాయి. దాంతో పవన్ కళ్యాణ్ సంతోషానికి అవధులు లేవు..ఇకపోతే పవన్ ఇప్పుడు వైసీపీ పై మాటల యుద్దానికి దిగాడు. ఈ క్రమంలో భీమవరం వైకాపా ఎమ్మెల్యే పై ఘాటు విమర్శలు చేశారు.సహకార బ్యాంకును దోచేసిన వ్యక్తి. చిరువ్యాపారులు, ఉపాధ్యాయులు, మధ్య తరగతి ప్రజల కష్టార్జితాన్ని బ్యాంకులో దాచుకుంటే వాటిని మింగేసిన వ్యక్తి. బెదిరించటం, దుర్భాషలాడటం, సభ్యసమాజం తలదించుకునేలా పరుష పదజాలం వాడటం, వ్యక్తిగతంగా నన్ను దూషించటం ఆయనకు రివాజుగా మారింది.