మహబూబాబాద్ జిల్లా కురవి పోలీసులు గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని అన్ని ఠాణాలకు సమాచారం అందించారు. దీంతో ఇక్కడి పోలీసులు రాజయ్య కుటుంబీకులను అక్కడికి తీసుకెళ్లి చూపించగా మృతదేహం అతనిదేనని గుర్తించారు. మృతుడి కుటుంబసభ్యులు ఆటోడ్రైవర్ ఎనగండుల బాబుపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా రాజయ్య భార్య లతకు అతనికి ఉన్న సంబంధం బయట పడింది.