ప్రతి ఓటరుకు ఓటింగ్ స్లిప్ చేరాలని చెప్పారు.ఈ ప్రక్రియలో వలంటీర్లను దూరంగా ఉంచడంతో పాటు వారిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి ఓటరుకు తమ ఓటు, పోలింగ్‌స్టేషన్ వివరాలు అందించాలని ఆదేశించారు. పార్టీ ప్రాతిపదికన మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే అనుమతి ఇస్తున్నామన్నారు. దీనిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.