పంచాయితీ ఎన్నికల ఫలితాలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు గాను బాబు మొదట గుడుపల్లె మండలంలో పర్యటించిన చంద్రబాబుకు ఊహించని దెబ్బ తగిలింది.కార్యకర్తలకు మీరేం చేశారు అంటూ పలువురు పార్టీ నేతలు నిలదీయడంతో షాక్కు గురయ్యారు. ఆపై శుక్రవారం కూడా ఇదే అనుభవం ఎదురవడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక మూడు రోజుల పర్యటనను మధ్యలోనే నిలిపేశారు. బాబు పర్యటనలో అడుగడుగునా జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించడం తో బాబు అక్కడ ప్రజలకు మొహం చూపించలేక స్వగృహానికి బయలు దేరాడు.. ఇలాంటి అనుభవాలు బాబుకు గతంలో కూడా జరిగింది.