రోజు తినే ఆహారాన్ని కల్తీ చేయడం కొంతమందికి ప్యాపారంగా మారింది. అయితే దాన్ని అరికట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆహరాన్ని కల్తీ చేసే వారికి జీవితఖైదు శిక్ష విధించే చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ కేబినెట్ కొత్త చట్టాన్ని రూపొందించింది. 'మిలావత్ పే కసావత్' నినాదంలో భాగంగా దీన్ని తీసుకొచ్చినట్లు మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా శనివారం మీడియాకు తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్లో గతంలో ఆహర పదార్థాలు కల్తీ చేసేవారికి ఆరు నెలల జైలు శిక్ష విధించేవారు. ఆ తర్వాత దీన్ని మూడేళ్లకు పొడిగించిన విషయం తెలిసిందే..  కానీ ఇప్పుడు మాత్రం జీవితాంతం జైల్లో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.