తిరుపతిలో పోటీ చేసేందుకు బీజేపీ ముందు చూపినంత ఆసక్తి ఇప్పుడు చూపడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. విశాఖ సొంత హక్కు అయిన ఉక్కు ప్రైవేటీకరణ పై కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రులు రగిలిపోతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర బీజేపి నేతలు కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇప్పటి పరిస్థితుల్లో మిత్రపక్షమైన జనసేనకు తిరుపతి సీటు అప్పగించడం శ్రేయస్కరమని బీజేపీ శ్రేణులు వివరించినట్లు తెలుస్తోంది. పైగా ఐదు బలిజ సంఘాలు చంద్రగిరిలో సమావేశమై, తిరుపతి ఎంపీ సీటును జనసేనకు కేటాయించాలని, ఒకవేళ వారికి ఇవ్వకుంటే తమ సామాజికవర్గం నోటాకు ఓట్లు వేస్తామని స్పష్టం చేశారు.