తెదేపా అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొవిడ్ నిబంధనల్లో భాగంగా పర్యటనకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విమానాశ్రయంలోనే చంద్రబాబు ఉండిపోయారు.అక్కడే నేలపై బైఠాయించి ఆయన నిరసనకు దిగారు. మరోవైపు తెదేపా శ్రేణులు పెద్దసంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తూ చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు.