తిరుపతి, చిత్తూరు నగరాలతో పాటు వివిధ పట్టణాలకు మదనపల్లె, కుప్పం, అనంతపురం, కడపతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. ఇటీవల పెరిగిన ఇంధన ధరలతో వాహన యజమానులు అద్దెలు దాదాపు 50 శాతం వరకు పెంచారు. లారీ యజమానుల సంఘాలు అద్దెలు సవరించాయి. దూరం, బరువును బట్టి ఖరారు చేశారు. సాధారణంగా రైతులు బుట్టల రూపంలో కూరగాయాలను ఎగుమతి చేస్తారు. పలువురివి సేకరించి ట్రక్కుల్లో నగరాలకు, పట్టణాలకు తీసుకువస్తారు..దాంతో రేట్లు పూర్తిగా పెరిగిపోతున్నాయి