రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు, మరో బైక్పై విజయసాయి ఉన్నారు. కానీ ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోకపోవడం విశేషం. అంతేకాకుండా మాస్క్ కూడా పెట్టుకోకుండా కోవిడ్ నిబంధనలను గాలికొదిలేశారు. బాధ్యతగల పదవుల్లో ఉండి, హెల్మెట్ ధరించకుండా బుల్లెట్ నడపటంతో పాటు కోవిడ్ నిబంధనలు అతిక్రమించడంతో ఇరువురు నేతలు విమర్శలకు గురవుతున్నారు...ఏపీలో ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఒక పక్క ప్రభుత్వమే భారీ జరిమానాలు విధిస్తుంటే... మరోపక్క ఆ ప్రభుత్వంలోని వారే నిబంధనలు గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు.