ఎయిర్‌పోర్టులో చంద్రబాబును అడ్డుకోవడంపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనను వైజాగ్ ఎయిర్‌పోర్టులో ఆనాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఎపిసోడ్‌తో అటు వైసీపీ మద్దతుదారులు, ఇటు టీడీపీ మద్దతుదారులు కూడా పోల్చుతుండడం విశేషం. ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు.. తమ నేతను ఇలాగే అడ్డకున్నారు కదా అని వైసీపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ప్రతిపక్షనేతను అడ్డుకుంటే ప్రశ్నించని వాళ్లు ఇప్పుడెలా మాట్లాడతున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనికి టీడీపీ నుంచి అంతే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి.. ఏది ఏమైనా కూడా లెక్క సరిపోయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు..