ఆంధ్ర ప్రదేశ్ లో పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఈ ఎన్నికలు మార్చి రెండో వారంలో జరగనున్నాయి. ఈ మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ ఉపసంహరణ చేసుకోనున్నారు. చిత్తూరు జిల్లాలో నేడు నామినేషన్ల ఉపసంహరణ జరగనున్నాయి.. జిల్లాలో రెండు కార్పొరేషన్లు, అయిదు పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ప్రారంభం కానుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను వెలువరించనున్నారు