ఏపి లో మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే చాలా చోట్ల టిడిపి అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరించుకోవడం ఆ పార్టీకి ఇప్పుడు తలనొప్పిగా మారింది. టిడిపి అభ్యర్థులు పెద్దసంఖ్యలో నామినేషన్లు వెనక్కి తీసుకున్న కారణంగా వైసిపి అభ్యర్థులు ఏకగ్రీవంగా అవుతున్నారు. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా పుంగనూరు లో టిడిపి పోటీకి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. మూడు వార్డులు లోనే ఎన్నికల సంఘం నామినేషన్లకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే ఆ వార్డుల్లో కూడా టిడిపి నామినేషన్ వేయి పరిస్థితి కనిపిస్తోంది. ఇక చాలాచోట్ల రెండోసారి అవకాశం ఇచ్చిన సరే టిడిపి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు కాలేదు..