రెండో విడత ఎన్నికల నుంచి పంచాయతీల్లో జరుగుతున్న అక్రమాలను ఎన్నికల కమిషన్ అడ్డుకోలేకపోయింది. చివరికి కౌంటింగ్ కేంద్రాలను కూడా కబ్జా చేసేసి.. కరెంట్ తీసేసి మరీ అర్ధరాత్రి ఫలితాలు మార్చేస్తుంటే.. అవతలి వాడు గెలిచినట్టు ప్రకటిస్తుంటే ఎన్నికల కమిషన్ చోద్యం చేస్తుందనే విమర్శ ప్రతిపక్షాల నుంచి వచ్చింది.అయిన మౌనం పాటించారు. దీంతో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన నిమ్మగడ్డకు ఇప్పుడు ఏమైంది?. ఎన్నికల నిర్వహణలో ఫెయిలవుతున్నారనే ఆరోపణలు ఎందుకు వచ్చాయి?. ఏకంగా జగన్తో రాజీపడ్డారని విపక్షాలు ఎందుకు అనుమానిస్తున్నాయి? జగన్ తో చేతులు కలిపారా? ఇలాంటి రక రకాల ప్రశ్నలు టీడీపీ శ్రేణుల్లో కలుగుతుంది..