ఏపి లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు రాజకీయాల్లో కీలకంగా మారాయి. నామినేషన్ ప్రక్రియ పూర్తి కాక ముందే టీడీపీ , వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. చిత్తూరులో మాత్రం ఘర్షణలు తారా స్తాయికి చేరుకున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసిన వ్యక్తికి ప్రతిపాదించానన్న అక్కసుతో తనపై వైకాపా కార్యకర్తలు దాడి చేసి..పళ్లు ఊడగొట్టారని తిరుపతికి చెందిన తెదేపా కార్యకర్త గోళ్ల లోకేష్నాయుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.