మునిసిపల్ ఎన్నికల్లో వైకాపా నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. నిన్న కడప బీజేపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జమ్మలమడుగు నగర పంచాయతీలోని 18వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఇస్మాయిల్ ను మేము కిడ్నాప్ చేశామని ఆయన తల్లితో ఫిర్యాదు చేయించారని వాపోయారు.