తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సినీ రాధిక ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె కోసం రెండు నియోజకవర్గాలు పరిశీలిస్తున్నట్టు ఏఐఎస్ఎంకే వ్యవస్థాపకుడు, ఆమె భర్త శరత్ కుమార్ తెలిపారు. ఆమె కోసం తెన్‌కాశీ, వేలచెర్రి నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. బుధవారం పుదుకొట్టైలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో రాధిక మాట్లాడుతూ.. శరత్ కుమార్‌కు భయం లేదని, ఆయన కేవలం ఆప్యాయతకే తలవంచుతారన్నారు.