మేఘాలయలో ఉన్న ఉంగోట్ నది స్వచ్చతకు మారుపేరుగా నిలుస్తుంది. నది అడుగుభాగంలో ఉన్న రాళ్ళు రప్పలు కూడా స్పష్టంగా కనబడేంత స్వచ్చంగా నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. జాంతియా జిల్లాలో దాంకీ అనే చిన్న నగరానికి దగ్గరగా ఉండే ఈ నదిలో ప్రయాణించడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. పడవ మీద ప్రయాణిస్తుంటే నదిలో కనిపించే జీవరాశులు, వాటికింద కనిపించే రాళ్ళు, మరింత అందంగా కనిపించి కనులకు కనువిందు చేస్తుంటాయి. అందుకే ఈ నదిని ఆసియాలేనే అత్యంత శుభ్రమైన నదిగా గుర్తించారు. ఇలాంటి నదులను చూడాలంటే పెట్టి పుట్టాల్సిందే.. ఒకసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఈ నదిని చూడండి..