ఏపి లో రసవత్తరంగా మారినా నామినేషన్ల ఉపసంహరణ పక్రియ రసాభాసగా మారింది. పంచాయితీ ఎన్నికలకు మించి ఏకగ్రీవాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరుగనున్న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 2,900 మందికిపైగా అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.. అభ్యర్థుల తుది జాబితాను కూడా ఎన్నికల కమీషనర్ విడుదల చేశారు. అయితే అందరి దృష్టి చిత్తూరు, కడప పైనే ఉంది. పంచాయితీ ఎన్నికలలో జరిగిన తంతు ఇక్కడా కొనసాగుతుంది.