పురపాలక ఎన్నికల్లో వైకాపా శ్రేణులు ఫోర్జరీ పత్రాలతో ప్రత్యర్థుల నామినేషన్లను బలవంతంగా ఉపసంహరించారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలనే ఎస్ఈసీ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఆయన లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో వైకాపా అక్రమాలకు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. వైకాపా నాయకులు, ఓ వర్గం అధికారులు, పోలీసులు కలిసి పోయి వైసీపీ నేతల ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణకు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.