కడప నగరపాలక సంస్థ, ప్రొద్దుటూరు, బద్వేలు పురపాలక సంఘాల్లో వైకాపా అభ్యర్థులకు రెబల్స్ నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది.నగరపాలక సంస్థలో ప్రచారం జోరందుకుంది. ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, వైకాపా మేయరు అభ్యర్థి సురేష్‌బాబు గురువారం సాయంత్రం వేర్వేరుగా ప్రచారం నిర్వహించారు. వీరిద్దరూ 8వ తేదీ వరకు చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. తెదేపా అభ్యర్థులు బరిలో ఉన్న వార్డుల్లో ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్‌రెడ్డి, కృష్ణమూర్తి ప్రచారం నిర్వహిస్తున్నారు.. కొన్ని ప్రాంతాల్లో బీజేపి గట్టి పోటీని ఇస్తున్నారు. ఇప్పటికే కడప మొత్తం కాషాయం జెండాలు కూడా ప్రచారంలో జోరు పెంచాయి. ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి...