కొత్తగా మొదలెట్టిన సెలూన్ బాగా నడవడానికి అతడు చేసిన ప్రకటన బాగా పనిచేసింది. అక్కడకి వచ్చే కస్టమర్ల కోసం బంగారు బ్లేడుని చేయించాడు. బంగారు బ్లేడుతో షేవింగ్ చేయడాన్ని ఒక గర్వంగా భావించే అందరూ తన సెలూన్ కి వస్తారని అనుకున్నాడు.. అందరికంటే కాస్త భిన్నంగా గొప్పగానే ఉంటుంది.. ప్రజలు ఆ విధంగా ఆలోచించి అయినా తన సెలూన్‌కు వస్తారని భావించాడు. ఈ మేరకు తన సెలూన్లో కొన్ని మార్పులు చేసి, స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా బంగారు రేజర్‌తో షేవింగ్ సేవలను ప్రారంభించాడు..