భీమా పేరుతో చాలా మోసాలు వెలుగు లోకి వస్తున్నాయి.. పేద కుటుంబాలకు టార్గెట్ చేస్తూ వారి పేరు మీద వస్తున్న భీమాలను అప్పనంగా దోచుకుంటున్నారు.కాసుల కోసం కక్కుర్తిపడి నామినీలతో ఒప్పందాలు చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా ఏకంగా ప్రాణాలే తీసేస్తున్నాయి కొన్ని కిరాతక ముఠాలు. బీమా చేయించుకున్న వ్యక్తుల్ని హత్య చేసి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరిస్తూ పాలసీ డబ్బుల్ని దోచుకుంటున్నాయి. మొన్నా మధ్య నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. తీగలాగితే ఆ ఏజెంట్ల ముఠా డొంక కదిలి వారు చేసిన దారుణాలు వెలుగు చూస్తున్నాయి.