వైకాపా తరఫున మాజీ మేయరు కొత్తమద్ది సురేష్‌బాబు రెండోసారి అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. ఈయన ప్రస్తుతం 4వ డివిజన్ కార్పొరేటరుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టాక మొదటగా చిన్నచౌకు సర్పంచిగా గెలుపొందిన సురేష్‌బాబు, అనంతరం జిల్లా పరిషత్తు అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన భార్య జయశ్రీ గతంలో కడపలో కార్పొరేటరుగా గెలిచారు. అనంతరం ఈయన వరుసగా రెండుసార్లు పోటీచేసి కార్పొరేటరుగా విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో మేయర్ పదవిని బీసీకి రిజర్వేషన్ చేయడంతో సురేష్‌బాబుని నిలబెట్టడానికి వైకాపా పెద్ద తలలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది టీడీపీ అభ్యర్థి రషీదాను ను మేయర్ గా ప్రకటించారు. కాగా, ఇప్పుడు టీడీపీకి కడపలో అంత సీన్ లేదని తేలడంతో కడప పీఠం సురేష్ బాబుకే దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో మార్చి 14 న తెలియనుంది.