చెన్నైలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రముఖ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ప్రచారంలో పాల్గొంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు. నిన్న కొళత్తూరులో ఎన్నికల ప్రచారంలో కమల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ డీఎంకేపై కమల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మక్కల్ నీది మయ్యం నిజాయితీ పరుల గుడారంగా మారినట్టు పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న కాంక్షతో, మార్పు లక్ష్యంగా తనతో చేతులు కలిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే, డీఎంకేలు దొందుదొందే అని, ఈ రెండు పార్టీలు ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయని ఆరోపించారు.