మంత్రి రాజీనామా లేఖను సీఎం బీఎస్ యడియూరప్పకు రెండు రోజుల క్రితం పంపారు. తన వద్దకు ఓ పని కోసం వచ్చిన ఓ మహిళను మంత్రి రమేష్ జర్కిహోళి లైంగికంగా వాడుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. బెంగళూరులోని ఆర్టీ నగరలో నివాసం ఉండే యువతి రాష్ట్రంలోని డ్యామ్‌లను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది. దీని కోసం ఆయన లైంగికంగా వాడుకున్నారని ఆరోపణ..దినేష్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పిటిషన్ విత్ డ్రా చేసుకోవడానికి దినేష్ ముందుకు రావడంతో దాన్ని పై అధికారులతో పరిశీలించి, న్యాయనిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఇకపోతే యువతికి ఉద్యోగాన్ని కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.. అంతేకాదు ఆమె ఇష్టపడి అతనితో గడిపిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ విషయం కొలిక్కి వచ్చేవరకు ఆగాల్సిందే..