లోకేశ్ పర్యటన కాస్త వైసీపీ నేతలకు చిర్రెత్తించింది.. విషయానికొస్తే..మచిలీపట్నంలో తాపీ కత్తి పేర్ని నానిలు ఈ రెండేళ్ల కాలంలో కత్తి డ్రామాలు మినహా ప్రజలకు చేసింది ఏమిటో చెప్పాలంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. మచిలీపట్నంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం సోమవారం రోడ్‌షోలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. రామానాయుడుపేట, పరాసుపేట, చిలకలపూడి, చింతచెట్టు సెంటరు, తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తూ అధికార పార్టీ అక్రమాలపై ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పేర్ని ఈ రెండేళ్ల పాటు ఇక్కడ ఏం చేశారో ప్రజలకు సమాధానం ఇవ్వాలని కోరారు.