కడప జిల్లాలో ప్రొద్దుటూరు, బద్వేల్ లో కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి.ప్రొద్దుటూరులో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 5వ వార్డు వైసీపీ అభ్యర్థి మురళీధర్ రెడ్డి అనుచరులు హల్ చల్ చేశారు. దీనిపై టీడీపీ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం జరిగింది. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు..రాయచోటి, జమ్మలమడుగు లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని సమాచారం..