పెంపుడు జంతువులను మనుషుల్లా చూసుకోవడం చేస్తుంటారు. వాళ్ళకి ఎలా అన్నీ చేస్తారో అలానే చేస్తున్నారు. అయితే, ఓ కుటుంబం సొంత బిడ్డలా మేకను సాకుతున్నారు. దానికి అన్నీ కార్యక్రమాలు కూడా చేశారు.. ఇప్పుడు సీమంతం కూడా చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం కన్నకూతురి మాదిరిగా పెంచుకున్న ఓ మేకకు సీమంతం చేసింది. కన్నబిడ్డకు సీమంతం చేసినంత ఘనంగా ఈ వేడుక జరిపించి వార్తల్లో నిలిచింది.