నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించగా.. తాజాగా మరోసారి లాక్డౌన్ విధేంచేందుకు సిద్ధమైంది. నాగ్‌పూర్‌లో వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ నెల 15- 21 వరకు లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సేవలు అయిన పాలు, పండ్లు, కూరగాయలు, కిరాణ వస్తువులు లభించే దుకాణాలను తెరవడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. మార్చి 15 నుంచి నాగపూర్‌లోని అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ అమల్లోకి వస్తుందని..