ఎన్నికలు వస్తే చాలు రాష్ట్రంలో నేతలు హడావిడి చేస్తారు..ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారు. మరో విషయం ఏంటంటే తాయిలాలు చేయడం చేస్తుంటారు. ఈ మాటలు ఎక్కువ వినిపిస్తాయి కూడా..ఓట్లు కొల్లగొట్టడానికి తాయిలాలు ప్రకటించడంలో రాజకీయ నాయకులు పోటీ పడటం కూడా చూస్తుంటాం. రైతులకు రుణమాఫీలు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, బాలికలకు సైకిళ్లు, నిరుద్యోగులకు భృతులు, ఉద్యోగులకు వేతనాల పెంపులు,ఇలా చాలా తాజాగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఈ తాయిలాలు సాగుతున్నాయి.