నేపాలీకి చెందిన ఓ కుటుంబం మహారాష్ట్రలోని పూణెలో నివాసం ఉంటుంది. ఆ కుటుంబానికి చెందిన మహిళ 18 నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల బాలుడి కడుపు లావు కావడం ప్రారంభమైంది. అలా రోజురోజుకు దాని సైజు పెరిగిపోతుండడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు.శిశువు కడుపులో కాలేయం, కుడి మూత్రాశయం మధ్యలో పిండం పెరుగుతుందని తెలిపారు. అంతేకాదు.. పిండానికి కాళ్లు, వేళ్లు, చర్మం, జుట్టు, ఎముకలతోపాటు ఇతర అవయవాలు ఏర్పడ్డట్టు చెప్పారు. పెద్ద రక్త నాళాలకు అనుసంధామై.. ఈ పిండం పెరుగుతున్నట్లు గుర్తించారు. బాలుడి ప్రాణాలు నిలవాలంటే పిండం తొలగించాలని తెలిపారు..