తనకు వివాహ యోగం కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన యువకుడి ఉదంతం యూపీలో వెలుగుచూసింది. షమ్లి జిల్లా కైరానా పట్టణంలో 26 ఏండ్ల అజీం కాస్మెటిక్స్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ఐదుగురు అన్నలుండగా అందరిలోకి అజీం చిన్నవాడు. గత ఐదేండ్లుగా ఎన్నో సంబంధాలు చూసినా తన హైట్ కారణంగా ఏ ఒక్కటీ పెండ్లి పీటల వరకూ సాగలేదు. కేవలం రెండు అడుగుల పొడవున్న అజీం పెండ్లి ప్రయత్నాలతో విసిగి వేసారాడు. ఇక తనకు సరైన సంబంధం చూడాలని అజీం యూపీ పోలీసులను ఆశ్రయించాడు.