శివరాత్రి పండుగ నాన్ వెజ్ వద్దందని భార్య వాదించిందని కోపంతో ఊగిపోయిన భర్త భార్యను చంపేశాడు.వివరాల్లోకి వెళితే..పండగ పూట ఆమ్లెట్ వద్దన్నందుకు భార్యను చంపి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని ఆతానూర్ మండలం ఉమ్రి(కే) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంగాధరోల్ల యోగేశ్ భార్య ఆమ్లెట్ వేయలేదని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.