మహారాష్ట్రతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా పంజాబ్లో కూడా కరోనా విజృంభిస్తోంది. పంజాబ్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగిపోతున్న దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ మేరకు 8 జిల్లాల్లో లాక్డౌన్ విధించడంతో పాటు పాఠశాలలు సైతం మూసివేశారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి నుంచి మరో నాలుగు జిల్లాల్లో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు. లుధియానా, పటియాలా, మొహలీ, ఫతేగఢ్, సాహిబ్, జలంధర్, నవాంశహర్, కప్తూర్తలాలలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించారు.