నగరపాలక పరిధిలోని 50 డివిజన్లలో.. 37 డివిజన్లలో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మిగిలిన 13 డివిజన్లకు ఈ నెల 10న పోలింగ్ నిర్వహించారు. అనంతరం బ్యాలెట్ పెట్టెలను పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో డివిజన్‌కు ఒక లెక్కింపు టేబుల్‌ను ఏర్పాటు చేశారు. ఇలా 13 డివిజన్లకు ఒక్కో టేబుల్ ఉంటుంది. ఒక డివిజన్ పరిధిలోని బ్యాలెట్ పెట్టెలను ఇదే టేబుల్‌పైనే లెక్కించనున్నారు. ఒక టేబుల్‌కు గరిష్ఠంగా మూడు రౌండ్లు ఉంటాయి. రౌండ్‌కు వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు బ్యాలెట్ పెట్టెలను తెరచి 25 బ్యాలెట్ పత్రాలను ఒక బండల్గా కట్టి టేబుల్‌పైన ఉన్న ప్లాస్టిక్ ట్రేలలో ఉంచారు.