కడప జిల్లాల్లో పురపాలక ఎన్నికలు మార్చి 10 న జరిగాయి.ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కౌంటింగ్ మొదలైంది.ఈ నేపథ్యంలో చాలా చోట్ల అభ్యర్థుల గెలు పోటములపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. పురపాలక సంఘాల్లో ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీల నాయకులు ఎవరికివారు అంచనాలు వేసుకుంటున్నారు. కడప నగరపాలక సంస్థలో ఎన్నికలు జరిగిన 26 డివిజన్లలో 20కిపైగా స్థానాలను కైవసం చేసుకుంటామని వైకాపా నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. 10 నుంచి 15 స్థానాల్లో విజయం తమదేనని తెదేపా నాయకులు చెబుతున్నారు.