కడప ఓట్ల లెక్కింపులో కూడా మొదటి విజయం టీడీపీకి పడటంతో ఈ సారి టీడీపీ బలం పుంజుకుందని ప్రజలు అభిప్రాయాపడ్డారు. గంట గంటకు జనాల్లో ఉత్కంఠ మొదలైంది. టెన్షన్ వాతావరణంలో ఓట్ల లెక్కింపు కొనసాగింది.మధ్యాహ్నం వరకు టీడీపీ కి ఊరట లభించిందని చెప్పాలి. ఆ తరువాత నుంచి వైసీపీ హవా కొనసాగింది. దీంతో కడప నగరం తో సహా అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ విజయ పథకాన్ని ఎగురవేసింది. కేవలం ఒక్క మైదుకూరు లో మాత్రమే టీడీపీ మాట నిలబెట్టుకుంది. మొత్తానికి కడప జిల్లాలో టీడీపీ లెక్క తప్పిందనే విషయం స్పష్టం అవుతుంది.