తమిళనాడులో కమలహాసన్ మక్కల్ నీది మయం పార్టీ ఈ ఏడాది ఎన్నికల్లో బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా నేతలు కార్యకర్తల తో పాటుగా కమల్ కూడా ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు ఆయన కారుపై భాగంగా కమల్ హాసన్ కంచీపురంలో పర్యటించి తిరిగి హోటల్ కు కారులో వెళుతుండగా ఓ యువకుడు అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. మద్యం తాగి ఉన్న యువకుడరు కమల్ హాసన్ ను కలిసేందుకు కారును అడ్డుకోబోయాడు. ఈ ఘటనలో కారు కిటికీ దెబ్బతింది. యువకుడి దాడిలో కమల్ హాసన్ కు ఎలాంటి గాయాలు కాలేదని, కారు అద్దం పగిలిందని ఎంఎన్ఎం కార్యకర్తలు చెప్పారు.