తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. రానున్న కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీలలో చర్చలు జరుగుతున్నాయి. పార్టీని బలోపేతం చేయడానికి నేతలు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ ఒకవైపు , ప్రతిపక్షాలు మరో వైపు ఎన్నికల్లో నెగ్గెందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరో వైపు ఎన్నికలు సమీపించే కొద్దీ ఆ రాష్ట్రంలో సమీకరణాలు మారుతున్నాయి. పరిస్థితులు వేడెక్కుతున్నాయి. సీట్ల పంపకాల్లో విభేదాలు పార్టీల మధ్య కుంపట్లు రాజేస్తున్నాయి. కూటముల్లో చీలికలకు కారణమవుతున్నాయి. మిత్రపక్షాల నుంచి ఎక్కువ సీట్లు ఆశించి భంగపడ్డ పలు పక్షాలు కొత్త పార్టీలతో జత కడుతున్నాయి..