మైదూకూరు మున్సిపల్ చైర్మన్ ఎంపిక ప్రక్రియలో ఉత్కంఠకు తాజాగా తెరపడింది. ఎట్టకేలకు చైర్మన్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. చైర్మెన్‌గా మాచునూరు చంద్ర, వైస్ చైర్మెన్‌గా మహబూబ్ షరీఫ్ ఎంపికయ్యారు. ఎక్స్ అఫిషియో రెండు ఓట్లతో వైసీపీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. మైదుకూరులో వైసీపీ బలం 11, కాగా టీడీపీ బలం 12. అయితే టీడీపీ నుంచి గెలిచిన షేక్ మహబూబి ప్రమాణ స్వీకార ఓటింగ్ కేంద్రానికి హాజరుకాకపోవడంతో టీడీపీ బలం 11కు చేరింది. చివరకు రెండు ఎక్స్ అఫిషియో ఓట్లతో వైసీపీ బలం 13కు చేరడంతో చైర్మన్ పీఠం వరించింది.