ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్యన స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం , కోర్టులకు వెళ్లడం ఇలా ఎన్నో వివాదాలు జరిగాయి.