శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామానికి చెందిన మేరుగు నారాయణరెడ్డికి 80 సెంట్లు భూమి ఉంది. ఆయనకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే ఎనలేని అభిమానం. సీఎంగా పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నచ్చి గ్రామ సచివాలయం నిర్మించేందుకు రూ.10 లక్షల విలువైన 6 సెంట్ల స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చారు.. ఈ విషయం పై రైతు తన భూమికి సంబంధించిన భూ పత్రాలను నిన్న అధికారులకు అందజేశారు.