కర్ణాటక లో గత కొద్ది రోజులుగా సంచలనంగా మారిన ఘటన మంత్రి రాసలీల వీడియో బయటకు రావడం.. ఉద్యోగం కోసం అతని దగ్గరకు వెళితే అతను గడపన్నాడు అంటూ యువతి ఫిర్యాదు చేసింది. అనంతరం యువతి మాయం అయ్యింది. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె లొకేషన్ ను పట్టుకున్నారు.ఆ సీడీ వ్యవహారం పెద్ద చర్చనీయాంశం కావడంతో ఆమె కొన్నిరోజులు ఢిల్లీ, గోవాలో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆమెను త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారణ చేపడతామని సిట్ అధికారులు ప్రకటించారు.