కేరళ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు చుక్కెదురైంది. కూటమికి చెందిన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. కన్నూరు జిల్లాలోని తలసేరి నియోజకవర్గం, త్రిశూర్‌లోని గురువాయూర్, ఇడుక్కి జిల్లాలోని దేవికుళంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులు తిరస్కరించారు. తలసేరి జిల్లాలో బీజేపీ ఆ పార్టీ కన్నూర్ జిల్లాశాఖ అధ్యక్షుడు ఎన్ హరిదాస్‌ను బరిలో నిలిపింది