టాటా సన్స్ అనుబంధ జువెల్లరీస్ సంస్థ తనిష్క్.. తన వినియోగదారులకు సరికొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల పరిధిలో తమ షాపుల్లో ఆభరణాలు కొనుగోలు చేసేవారికి.. పే ఫ్రం హోం సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పే ఫ్రం హోం సేవలను తన వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన తనిష్క్ మిగిలిన రాష్ట్రాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.