దేశ వ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న వారికి అంతంత మాత్రం చదవులే.. 10వ తరగతి కూడా పాసై లేరు అని తెలుస్తుంది. కానీ వీళ్ళ ముందు సైంటిస్టులు కూడా బలాదూర్ అనే చెప్పాలి.ముఖ్యంగా కేవైసీ అప్డేట్ చేయాలని, కార్డు బ్లాక్ అవుతుందని, ఓఎల్ఎక్స్, ఫేస్బుక్, క్వికర్, క్యూఆర్ కోడ్, కస్టమర్ కేర్, లాటరీలకు సంబంధించి మోసాలకు పాల్పడుతున్నారు.ఆ రాష్ట్ర లకు చెందిన నేరగాళ్లు ఇతర రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. జార్ఖండ్ సైబర్ నేరగాళ్లపై అక్కడి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పట్టుబడిన వారికి ఆరు నెలల వరకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు.