ఏపి ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పేద ప్రజలకు పక్కా ఇల్లు కట్టించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదికూడా పల్లెటూరిలో కాకుండా పట్టణంలో ఉండే పేదలకు ఉచిత ఇంటిని కట్టిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు ఇల్లస్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం పేదలకు కేవలం ఒక్కరూపాయికే ఇల్లు ఇవ్వనుంది. పట్టణాల్లో షియర్ వాల్ టెక్నాలజీతో నిర్మించిన జీ+3 అపార్ట్ మెంట్లలో నిర్మించిన 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన మొత్తం 1,43,600 ఇళ్లను కేవలం ఒక్కరూపాయికే లబ్ధిదారులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.