ఖమ్మం జిల్లా వేంసూర్ తహశీల్దార్ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ రైతు నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్ గుర్వేశ్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సత్తుపల్లికు చెందిన తోట సాంబశివరావు అనే రైతు తనకు వేంసూర్ మండలంలో ఉన్న 25 ఎకరాల వ్యవసాయ భూమికి సంభందించి సర్వే నిమిత్తం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో సర్వే చేయటం కోసం వేంసూర్ సర్వేయర్ గుర్వేశ్, డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్లు దరఖాస్తుదారుడిని రెండు లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. అయితే , చివరికి లక్షన్నర కు రేటు కుదిరింది. తహశీల్దార్ కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్ గుర్వేశ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు